లింగంపేట మండలంలో అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

లింగంపేట మండలంలో అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
  • 15 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
  •  రేంజ్ ఆఫీసర్ వరుణ్​తేజ్​

లింగంపేట, వెలుగు : ఫారెస్ట్​భూముల ఆక్రమణలపై మంగళవారం అటవీ శాఖ ఆఫీసర్లు ఉక్కుపాదం మోపారు.  మండలంలోని ముస్తాపూర్ శివారులోని650 కంపార్ట్​మెంట్​ నంబర్​లో కొందరు గిరిజనులు ఆక్రమించుకున్న 15 ఎకరాల భూమిని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.  జేసీబీలతో కందకాలు తవ్వించినట్లు ఎల్లారెడ్డి ఇన్​చార్జి రేంజ్ ఆఫీసర్ వరుణ్​తేజ్ తెలిపారు. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడిన పలువురిపై  గతంలోనే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.​ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పృథ్వీరాజ్, ఎఫ్​ఎస్​వో భాస్కర్, విక్కీమార్టిన్, వినోద్, లింగంపల్లి బీట్ ఆఫీసర్ కల్యాణి, ఎల్లారెడ్డి ఫారెస్ట్​రేంజ్​ పరిధిలోని అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

12 రోజుల్లో 30 ఎకరాలు స్వాధీనం

ఎల్లారెడ్డి అటవీరేంజ్ పరిధిలోని లింగంపేట మండలంలో 12 రోజుల వ్యవధిలో 30 ఎకరాల అటవీ భూములను  స్వాధీనం చేసుకున్నారు. గత నెల 19న పర్మల్ల మాలోత్ తండా శివారులో 15 ఎకరాల​ భూమి,  మంగళవారం ముస్తాపూర్ అటవీ భీట్​లో15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.  లింగంపేట మండలంలో వందల ఎకరాల అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.